బేబీ: ‘బేబీ’ దర్శకుడికి మరో కారు గిఫ్ట్.. సక్సెస్ కిక్ అలాంటిది

ఈ ఏడాది కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘బేబీ’ సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగా స్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల ప్రశంసలు అందుకుంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ. 90 కోట్లకు పైగా కలెక్ట్ చేసి.. చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ విజయం నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేష్‌కి నిర్మాత ఎస్‌కేఎన్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం భారీ విజయం సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించడంతో నిర్మాత హీరో, దర్శకులు, సంగీత దర్శకులకు కాస్ట్లీ కార్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ‘బేబీ’ విషయానికి వస్తే.. చిన్న సినిమాల విషయానికొస్తే.. ఈ సినిమా సాధించిన కలెక్షన్లు దాదాపు ‘జైలర్’ రేంజ్ లోనే ఉన్నాయని చెప్పాలి. అందుకే నిర్మాత ఎస్కేఎన్.. మరోసారి ఇలా తన సినిమా సక్సెస్ కిక్ అందించాడు. నిజానికి ‘బేబీ’ సినిమా విడుదలకు ముందు చూసిన హడావిడిపై నమ్మకంతో దర్శకుడు సాయి రాజేష్‌కి కారు బహుమతిగా ఇచ్చిన నిర్మాత ఎస్‌కెఎన్‌.. ‘బేబీ’ విజయం సాధించిన ఆనందంలో ఇప్పుడు బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు.

సాయి-రాజేష్.jpg

ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి ఎస్కేఎన్, సాయి రాజేష్ మంచి స్నేహితులు. ‘బేబీ’ సినిమా విజయం వారి మధ్య ఉన్న స్నేహానికి, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకానికి, సినిమా నిర్మాణంపై ఉన్న మక్కువకు కొలమానం. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ‘బేబీ’ (బేబీ మూవీ) సినిమాకు కూడా ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇదిలా ఉంటే.. సాయి రాజేష్ కూడా తన తదుపరి చిత్రాన్ని నిర్మాత ఎస్‌కెఎన్‌తో చేస్తున్నాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

==============================

****************************************

*******************************************

*******************************************

****************************************

నవీకరించబడిన తేదీ – 2023-09-29T19:50:24+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *