బాంబు పేలుడు నేపథ్యంలో పార్లమెంట్ హౌస్, హోం మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో దాడి జరిగిన ప్రదేశం చుట్టూ గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
టర్కీ పార్లమెంట్ పేలుడు: టర్కీ రాజధాని అంకారాలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడి జరిగింది. ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు భద్రతా బలగాల చేతిలో మరణించారు. ఈ పేలుడులో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మరణించారు అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ పేలుడులో స్థానిక పౌరులు ఎవరూ చనిపోలేదని స్థానిక మీడియా పేర్కొంది.
గేట్ 2024 దరఖాస్తు: గేట్ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు
ఇద్దరు ఉగ్రవాదులు వాణిజ్య వాహనంలో నేషనల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ భవనం వద్దకు చేరుకున్నారని, వారిలో ఒకరు తనను తాను పేల్చేసుకున్నారని టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. అయితే బాంబు పేలుడు సంభవించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసుల కాల్పుల్లో రెండో ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. పార్లమెంటు భవనం, ప్రభుత్వ మంత్రిత్వ శాఖ భవనాల సమీపంలో పేలుడు సంభవించింది.
వందే భారత్ స్లీపర్ కోచ్: వందే భారత్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త… వచ్చే ఏడాది స్లీపర్ కోచ్‌లు
ఇదిలావుంటే.. వేసవి సెలవుల అనంతరం టర్కీలో పార్లమెంట్ నేటి నుంచి ప్రారంభం కానుంది. బాంబు పేలుడు నేపథ్యంలో పార్లమెంట్ హౌస్, హోం మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో దాడి జరిగిన ప్రదేశం చుట్టూ గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఆత్మాహుతి దాడిపై అంకారా చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించిందని టర్కీ న్యాయ మంత్రి యిల్మాజ్ తున్ తెలిపారు. దాడిని ఖండిస్తూ, గాయపడిన పోలీసు అధికారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదంపై టర్కీ పోరాటానికి ఈ దాడులు ఎలాంటి ఆటంకం కలిగించవని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై మన పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.