సీఎం జగన్, మంత్రి రోజా పరువు తీశారంటూ బండారు సత్యనారాయణపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. బండారు సత్యనారాయణ అరెస్ట్

బండారు సత్యనారాయణ అరెస్ట్
బండారు సత్యనారాయణ అరెస్ట్: హైడ్రామా ముగిసింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో తీవ్ర ఉద్రిక్తత మధ్య బండారు సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు 41ఎ, 41బి కింద పోలీసులు నోటీసులు జారీ చేసి బండారును అదుపులోకి తీసుకున్నారు. కాగా, అనకాపల్లిలోని బండారు ఇంటి దగ్గర ఈరోజు ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండారు ఇంటికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారని తెలుసుకున్న టీడీకే కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. బండారు అరెస్టును టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి.
బండారు ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బండారును పోలీసులు అరెస్టు చేయకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు సీఎం జగన్, మంత్రి రోజా పరువు తీశారంటూ బండారు సత్యనారాయణపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి..ఏపీ రాజకీయాలు: ఏపీలో రాజకీయ వేడి.. నెక్స్ట్ టార్గెట్ నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే?
దాదాపు 13 గంటల ఉత్కంఠకు తెరపడింది. బండారును అరెస్ట్ చేస్తారని ఉదయం నుంచి పుకార్లు వచ్చాయి. బండారు ఇంటికి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఉదయం నుంచి బండారు సత్యనారాయణ సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు. ఎవరూ లోపలికి రాకుండా పోలీసులు తలుపులు వేసారు. చివరకు పోలీసులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో బండారు కొడుకు బండారు అప్పలనాయుడు కొంతమంది పోలీసులను లోపలికి రమ్మని చెప్పాడు.
గుంటూరు, అనకాపల్లి పోలీసులు లోపలికి వెళ్లారు. బండారుకు నోటీసులు ఇచ్చారు. సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులకు సంబంధించి బండారు సత్యనారాయణకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బండారు ఆరోగ్యం బాగోలేదని అక్కడే విచారించాలని టీడీపీ నేతలు పోలీసులను కోరారు. అయితే పోలీసులు అందుకు అంగీకరించలేదు. పోలీసులు బండారును అరెస్టు చేసి గుంటూరు తరలించారు.
ఇది కూడా చదవండి..బొత్స : ఎమ్మెల్యేలు, ఎంపీపీలపై మంత్రి బొత్స ఎందుకు ఆగ్రహం?