ఇస్రో చైర్మన్ ఎస్.ఎస్

ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్
చెన్నై (ఆంధ్రజ్యోతి), రామేశ్వరం, అక్టోబర్ 15: చంద్రయాన్-3 ప్రయోగానికి ముందు ఈ వ్యోమనౌక అభివృద్ధి కార్యక్రమాలను చూసిన అమెరికా.. ఈ స్పేస్ టెక్నాలజీని తమకు విక్రయించాలనుకుంటున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఆదివారం రామేశ్వరంలోని ఆయన స్మారక మందిరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొన్నారు. కలాంకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను తయారు చేసిన తర్వాత అమెరికా నుంచి నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (జేపీఎల్) నిపుణులను ఇక్కడికి ఆహ్వానించాం. చంద్రయాన్-3 గురించి వివరించాం. చంద్రయాన్-3లో మనం వినియోగించిన శాస్త్రీయ పరికరాలను చూసిన నాసా నిపుణులు తక్కువ ఖర్చుతో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారని కొనియాడారు.ఎలా డిజైన్ చేశారు..?ఈ టెక్నాలజీని అమెరికాకు ఎందుకు అమ్మకూడదు..?సోమ్‌నాథ్ అన్నారు.
చెన్నైలోని అగ్నికుల్, హైదరాబాద్‌లోని స్కైరూట్‌లు రాకెట్లను నిర్మిస్తున్నాయని సోమనాథ్ తెలిపారు. అదేవిధంగా అంతరిక్ష సాంకేతికతలో భారత్‌ను మరింత శక్తివంతం చేసేందుకు రాకెట్లు, ఉపగ్రహాలను తయారు చేసే దిశగా ప్రజలు ముందుకు రావాలని సోమనాథ్ పిలుపునిచ్చారు. కలాం జయంతి సందర్భంగా ఆదివారం రామేశ్వరంలో సోమనాథ్ హాఫ్ మారథాన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో పుట్టి సాధారణ విద్యనభ్యసించిన కలాం ఇస్రో ఇంజినీర్‌గా, రాకెట్ ఇంజనీర్‌గా, రాష్ట్రపతిగా రాణించారన్నారు. తాను కూడా సాధారణ పాఠశాలలోనే చదివానని చెప్పారు.
21న గగన్యాన్‌కు టీవీ-డీ1 పరీక్ష
వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన ఇస్రో గగన్‌యాన్ మిషన్ కీలక పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈ మిషన్‌లో కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరును ప్రదర్శించేందుకు ఈ నెల 21న తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 (టీవీ-డీ1) పరీక్ష నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ తెలిపారు. ఈ పరీక్ష అనంతరం మరో మూడు (డీ2, డీ3, డీ4) పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-16T02:46:25+05:30 IST