సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలవడం తమకు ప్రపంచకప్ గెలిచినంత ఆనందాన్ని ఇచ్చిందని రషీద్ ఖాన్ అన్నాడు. ఈ విజయంతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని రషీద్ అన్నాడు.

క్రికెట్ ప్రపంచంలో ఆఫ్ఘనిస్థాన్ ఇప్పుడు ప్రమాదకరంగా మారుతోంది. వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చిన కొద్దిరోజులకే అఫ్ఘానిస్థాన్ కూడా పాకిస్థాన్ లాంటి జట్టుకు చావుదెబ్బ తగిలింది. పాకిస్థాన్‌పై చరిత్రాత్మక విజయం. ఈ విజయంతో అఫ్గానిస్థాన్ ఆటగాళ్లంతా అనూహ్యంగా సంబరాలు చేసుకున్నారు. పాకిస్థాన్‌పై గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందంటూ మైదానంలో డ్యాన్స్ కూడా చేశారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆఫ్ఘనిస్థాన్‌కు ఇది మూడో విజయం. 2015లో స్కాట్లాండ్‌పై గెలిచిన తర్వాత 2023 వరకు గెలవలేదు.2019లో మాత్రం ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ గెలవడం సులువేనని అందరూ భావించారు. అయితే ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి టైటిల్ ఫేవరెట్లను ఓడించి ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ అంటే అన్ని జట్లూ వణికిపోతున్నాయి.
ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికా: సహించే సఫారీలు.. 8 మ్యాచ్‌లు.. 7 సార్లు 300 ప్లస్ స్కోర్లు..!!
మరోవైపు పాకిస్థాన్‌తో వన్డేల్లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ఇదే తొలి విజయం. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ఈ విజయం రావడంతో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. ఈ విజయంపై ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్పందించాడు. పాకిస్థాన్ లాంటి జట్టుతో మ్యాచ్ గెలిస్తే ప్రపంచకప్ గెలిచినట్లే. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టుతో తాము 7 మ్యాచ్‌లు ఆడామని, ఒక్కటి కూడా గెలవలేకపోయామని చెప్పాడు. అయితే సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలవడం ప్రపంచకప్ గెలిచినంత ఆనందాన్ని ఇచ్చిందని రషీద్ ఖాన్ అన్నాడు. ఈ విజయంతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని రషీద్ అన్నాడు. పాకిస్థాన్‌పై ఇలాంటి విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆఫ్ఘనిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అన్నాడు. ఇవి కేవలం జట్టుకే కాకుండా అఫ్గానిస్థాన్ ప్రజలందరికీ మధుర క్షణాలని…దాదాపు 12 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నామని చెప్పాడు. వన్డే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో పాకిస్థాన్‌ను ఓడించిన జట్టులో సభ్యుడిగా ఉండడం తన కెరీర్‌లోనే హైలైట్‌గా నిలిచిందని చెప్పాడు. కొద్ది రోజుల క్రితం తాము ఇంగ్లండ్‌ను ఓడించామని, ఇప్పుడు పాకిస్థాన్‌పై గెలిచిన తర్వాత జట్టులోని అందరూ సంతోషంగా ఉన్నారని మహ్మద్ నబీ వివరించాడు.
నవీకరించబడిన తేదీ – 2023-10-24T20:41:55+05:30 IST