టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న బేబీ మూవీ.. బాలీవుడ్ లో రీమేక్ అవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారట.

బేబీ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నట్టు నిర్మాత ఎస్‌కెఎన్ ప్రకటించారు
బేబీ మూవీ : ‘కలర్ ఫొటో’తో నేషనల్ అవార్డు అందుకున్న సాయి రాజేశ్.. దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా ‘బేబీ’. శ్రీనివాస కుమార్ (SKN) నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రం కేవలం 10 కోట్లతో బాక్స్ ఆఫీస్ వద్ద 90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు థియేటర్లలో 50 రోజులు ప్రదర్శితం కావడం లేదు, అతితక్కువ టైంలోనే ఓటీటీలో 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించడం వంటి రికార్డ్స్ ని కూడా సెట్ చేసింది. ఇక ఇంతటి విజయం సాధించిన ఈ సినిమాపై ఇతర పరిశ్రమల మేకర్స్ దృష్టి పడింది.
దీనితో పలు భాషల్లో ఈ సినిమాని రూపొందించేందుకు చిత్ర నిర్మాతలను సంప్రదిస్తున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ కి కూడా ఈ చిత్రం వెళ్తుందంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తను ఇప్పుడు నిజం చేస్తూ నిర్మాతలు మీడియాకి తెలియజేసారు. అయితే రీమేక్ అవకాశం మరొకరికి ఇవ్వకుండా.. తెలుగు నిర్మాతలే ఆ భాద్యతలను తీసుకుంటున్నారు. బాలీవుడ్ లో కూడా SKN ఈ నిర్మాణం నిర్మించబోతున్నాడు. ఇక దర్శకత్వం బాధ్యత కూడా సాయి రాజేశే తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: సాగర్ : జనసేనలోకి ‘మొగలిరేకులు’ సీరియల్ నటుడు.. పోటీ చేస్తున్నారా..?
ఆల్రెడీ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. బాలీవుడ్ రైటర్స్ తో హిందీ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నాడట సాయి రాజేశ్. అయితే ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ ఎవరు అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బాలీవుడ్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఒక స్టార్ హీరో కొడుకు ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్ కోసం హిందీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ లిస్ట్ ని చూస్తున్నారట. వైష్ణవి తేజ్ కి హీరోయిన్ గా లైఫ్ ఇచ్చినట్లే అక్కడ కూడా ఒక కొత్త అమ్మాయికి లైఫ్ ఇవ్వడానికి రెడీ అయ్యారట.