తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 ఈరోజు ప్రచారం మరియు ఇతర ప్రత్యక్ష నవీకరణలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి.
ప్రత్యక్ష వార్తలు & నవీకరణలు
-
09 నవంబర్ 2023 12:06 PM (IST)
అంబులెన్స్‌లో నామినేషన్ వచ్చింది
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్
ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు
IOC కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గరిమా అగర్వాల్‌కు నామినేషన్ సమర్పణ
-
09 నవంబర్ 2023 12:02 PM (IST)
హనుమకొండలో స్వల్ప ఉద్రిక్తత
హనుమకొండ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత
బీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఒకేసారి రావడంతో ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేశారు.
పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేశారు
-
09 నవంబర్ 2023 11:58 AM (IST)
ఎల్‌బీ నగర్‌లో నామినేషన్లు
హైదరాబాద్: ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి నామినేషన్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ నామినేషన్
-
09 నవంబర్ 2023 11:56 AM (IST)
సిరిసిల్ల మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి మంత్రి కేటీఆర్ చేరుకున్నారు
నామినేషన్ అనంతరం కేటీఆర్ మీడియా సమావేశం
-
09 నవంబర్ 2023 11:54 AM (IST)
చెన్నూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల జిల్లా చెన్నూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
బీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఒకేసారి నామినేషన్ దాఖలు చేశారు.
బాల్క సుమన్ వాహనాన్ని కార్యాలయంలోకి అనుమతించడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు
ఇరు పార్టీల కార్యకర్తలు నాయకులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు
ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేస్తున్నారు
-
09 నవంబర్ 2023 11:49 AM (IST)
హెలికాప్టర్‌లో హుజూరాబాద్‌కు వెళ్లండి
కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు
ఈటల రాజేందర్ హెలికాప్టర్‌లో హుజూరాబాద్ చేరుకున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు
-
09 నవంబర్ 2023 11:46 AM (IST)
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ నామినేషన్
గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కామారెడ్డికి బయలుదేరారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఐఓసీ సెంటర్ బయట వేచి ఉన్న కార్యకర్తలకు సీఎం కేసీఆర్ అభివాదం చేశారు.