శ్రీలంక క్రికెట్ బోర్డు: మెగా టోర్నీలో శ్రీలంక పేలవ ప్రదర్శనపై ఆ దేశ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు స్వతంత్ర శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో బోర్డును రద్దు చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది.

మొరిగే నక్కపై తాటికాయ పడ్డట్టు తయారైంది శ్రీలంక క్రికెట్ జట్టు ప్రస్తుత పరిస్థితి. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత పరువు కోసం తహతహలాడుతున్న శ్రీలంకకు ఎదురు దెబ్బ తగిలింది. వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన టీమిండియాకు ఐసీసీ మరో షాక్ ఇచ్చింది. స్వతంత్ర శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో బోర్డును రద్దు చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. శుక్రవారం జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఐసీసీ ఈ ప్రకటన చేసింది.
అయితే ఐసీసీ విధించిన సస్పెన్షన్ ఎంతకాలం అమలులో ఉంటుందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో శ్రీలంక 9 మ్యాచ్‌లు ఆడి 2 మాత్రమే గెలిచి 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. టీమ్ ఇండియా చేతిలో 302 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. మెగా టోర్నీలో శ్రీలంక పేలవ ప్రదర్శన ఆ దేశ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై స్పందించిన శ్రీలంక కోర్టు.. బోర్డుకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రద్దును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలను ధిక్కరించిన శ్రీలంక పార్లమెంట్ ఆ దేశ క్రికెట్ పాలక మండలిని తొలగించాలని నిర్ణయించింది. ఘటన జరిగిన మరుసటి రోజే శ్రీలంక బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – 2023-11-10T21:37:08+05:30 IST