మధ్యప్రదేశ్ ఎన్నికలు 2023: బీజేపీ మేనిఫెస్టో విడుదల

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-11T16:54:27+05:30 IST

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ శనివారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్ ఎన్నికలు 2023: బీజేపీ మేనిఫెస్టో విడుదల

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ శనివారం మేనిఫెస్టోను విడుదల చేసింది. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టోను విడుదల చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ పాల్గొన్నారు.

మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం జేపీ నడ్డా మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ 14 రెట్లు పెరిగిందని, రాష్ట్ర జీడీపీ 19 రెట్లు పెరిగిందన్నారు. రిపోర్ట్ కార్డ్ రాజకీయాలను నమ్ముతానని, ఏం చెబితే అది చేస్తానని అన్నారు. ఈ మేనిఫెస్టో మధ్యప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి రోడ్ మ్యాప్‌గా ప్రధాని మోదీ ఇచ్చిన హామీ అని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు సంతృప్తిగా ఉందన్నారు. కడుపులోనే పసికందులను చంపేస్తున్నారని తన దృష్టికి రాగానే ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

కాగా, 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న పోలింగ్ జరగనుంది.డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 109 సీట్లకే పరిమితమైంది. బీజేపీ, ఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. 2020 మార్చిలో శివరాజ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీ బలం 127.

నవీకరించబడిన తేదీ – 2023-11-11T16:54:29+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *