క్రైం: దారుణం.. నాలుగేళ్ల బాలికపై ఎస్‌ఐ అత్యాచారం

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-11T10:52:18+05:30 IST

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో దారుణం జరిగింది. నాలుగేళ్ల బాలికపై సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన దౌసా జిల్లాలోని లాల్సోట్ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది.

క్రైం: దారుణం.. నాలుగేళ్ల బాలికపై ఎస్‌ఐ అత్యాచారం

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో దారుణం జరిగింది. నాలుగేళ్ల బాలికపై సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన దౌసా జిల్లాలోని లాల్సోట్ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. నిందితుడు భూపేంద్ర సింగ్ మధ్యాహ్నం మైనర్ బాలికను తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఏఎస్పీ రామచంద్ర సింగ్ నెహ్రా తెలిపారు. నిందితుడు భూపేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగుతోందని ఆయన చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు రాహువు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే నిందితుడు భూపేంద్రసింగ్‌ను పోలీసులు అరెస్టు చేసేలోపే స్థానికులు చితకబాదారు.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ కిరోడి లాల్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుల అసమర్థ పాలనపై అశోక్ గెహ్లాట్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వంటి సున్నితమైన సమయంలోనూ పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడడం మానుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “లాల్సోట్‌లో దళిత బాలికపై ఎస్‌ఐ అత్యాచారం చేయడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమాయక చిన్నారికి న్యాయం చేసేందుకు నేను సంఘటనా స్థలానికి చేరుకున్నాను. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ అసమర్థత, పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. వారు మానుకోవడం లేదు. ఎన్నికల వంటి సున్నితమైన పరిస్థితుల్లోనూ అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితుడు భూపేంద్ర సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.. అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలి.. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులందరినీ అన్ని విధాలా ఆదుకోవాలి.

నవీకరించబడిన తేదీ – 2023-11-11T10:53:01+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *