Vijay Deverakonda : మృణాల్‌తో కలిసి విజయ్ దేవరకొండ దీపావళి వేడుకలు చూశారా..?

హ్యాపీ దీపావళి అంటూ విజయ్ దేవరకొండ ఓ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో విజయ్, మృణాల్ కలిసి దీపావళి జరుపుకుంటున్నారు

Vijay Deverakonda : మృణాల్‌తో కలిసి విజయ్ దేవరకొండ దీపావళి వేడుకలు చూశారా..?

మృణాల్ ఠాకూర్‌తో కలిసి ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ దీపావళి వేడుకలు జరుపుకున్నారు

విజయ్ దేవరకొండ : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సంక్రాంతికి విడుదల చేసేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విజయ్‌కి గీతగోవిందం వంటి సూపర్‌ సక్సెస్‌ అందించిన పరశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈరోజు దీపావళి కావడంతో సెలబ్రిటీలందరూ తమ అభిమానులకు అప్‌డేట్‌ల రూపంలో గిఫ్ట్‌లు ఇస్తున్నారు.

ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ హ్యాపీ దీపావళి అంటూ ఓ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో విజయ్, మృణాల్ దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఈ ఫోటో ఫ్యామిలీ స్టార్ సినిమాలోని స్టిల్. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. తండ్రిగా, భర్తగా మధ్యతరగతి వ్యక్తిగా కొత్త పాత్రలో విజయ్ కనిపించనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: హిమజ : పోలీసులు వచ్చి తనిఖీ చేసారు అంతే.. నన్ను అరెస్ట్ చేయలేదు.. తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి..

ఇక విజయ్ ఇతర ప్రాజెక్టుల విషయానికి వస్తే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వీడీ12 సినిమా కూడా చేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ సినిమా కంటే ముందే ఈ సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఈ VD12ని పక్కన పెట్టి విజయ్ ఫ్యామిలీ స్టార్ వైపు చూస్తున్నాడు. ఈ సినిమాని పక్కన పెట్టి గౌతం తిన్ననూరి కూడా ఓ చిన్న హీరోతో సినిమా స్టార్ట్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. విజయ్ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాను డైరెక్ట్ చేసి రిలీజ్ చేయాలని గౌతమ్ ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *