ఆల్ టైమ్ రికార్డ్: క్రికెట్ చరిత్రలో సంచలనం.. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-14T18:30:53+05:30 IST

ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్‌లో ఓ అద్భుతం జరిగింది. ఇటీవల ముగ్గీరబా నెరంగ్, సర్ఫర్స్ ప్యారడైజ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతుల్లోనే ఆరు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ముద్గీరబా నెరంగ్ కెప్టెన్ గారెత్ మోర్గాన్ 6 బంతుల్లో 6 వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఆల్ టైమ్ రికార్డ్: క్రికెట్ చరిత్రలో సంచలనం.. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు

ఇప్పటి వరకు క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం చూశాం. కానీ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసిన దాఖలాలు లేవు. అయితే ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఈ రికార్డు సాధ్యమైంది. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీయడం ఇప్పటి వరకు రికార్డు. దేశవాళీ క్రికెట్‌లో న్యూజిలాండ్‌ ఆటగాడు నీల్‌ వాగ్నర్‌ ఈ ఘనత సాధించాడు. 2011లో వెల్లింగ్టన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓకే ఓవర్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. భారత ఆటగాడు అభిమన్యు మిథున్ కూడా ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీశాడు. 2019 రంజీ క్రికెట్‌లో కర్ణాటక తరఫున ఆడిన అభిమన్యు మిథున్ హర్యానాపై ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 4 బంతుల్లో 4 వికెట్లు తీయడం ఓ రికార్డు. శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ ఈ ఘనత సాధించాడు.

ఇటీవల ముగ్గీరబా నెరంగ్, సర్ఫర్స్ ప్యారడైజ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతుల్లోనే ఆరు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ముద్గీరబా నెరంగ్ కెప్టెన్ గారెత్ మోర్గాన్ 6 బంతుల్లో 6 వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 143 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎవరికీ అందని గౌరవాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. చివరి ఓవర్లో గారెత్ మోర్గాన్ ఈ ఘనత సాధించి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముద్గీరబా నెరంగ్ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 177 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని చేధించిన సర్ఫర్స్ ప్యారడైజ్ జట్టు 39 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో జట్టు విజయానికి 4 పరుగులు కావాలి. దీంతో చివరి ఓవర్ వేసేందుకు గారెత్ మోర్గాన్ బరిలోకి దిగాడు. ఆశ్చర్యపరిచే విధంగా వరుసగా 6 బంతుల్లో 6 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్యారడైజ్ బ్యాటర్లలో ఐదుగురికి గారెత్ మోర్గాన్ బంగారు బాతులను అందించాడు. ఈ ఆరు వికెట్లలో, మొదటి నాలుగు క్యాచ్ మరియు అవుట్ కాగా, మిగిలిన రెండు క్లీన్ బౌల్డ్.

మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవీకరించబడిన తేదీ – 2023-11-14T18:30:54+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *