IND Vs AUS: విశాఖపట్నం వేదికగా ఈరోజు రాత్రి భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో విజయం సాధించాలని టీమిండియా క్రికెటర్లు మ్యాచ్ ప్రారంభానికి ముందు సింహాచలంలోని అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం స్వామివారి సన్నిధికి వచ్చిన టీమిండియా క్రికెటర్లను ఆలయ అధికారులు ఆహ్వానించారు.

వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా తమ సొంతగడ్డపై ఐదు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలి టీ20 ఈరోజు రాత్రి విశాఖపట్నంలో జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో విజయం సాధించాలని టీమిండియా క్రికెటర్లు మ్యాచ్ ప్రారంభానికి ముందు సింహాచలంలోని అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం స్వామివారి సన్నిధికి వచ్చిన టీమిండియా క్రికెటర్లను ఆలయ అధికారులు ఆహ్వానించారు. అనంతరం క్రికెట్ క్రీడాకారులకు వేదపండితులు, ఆలయ అర్చకులు వేదపండితులు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. సింహాచలం స్వామిని దర్శించుకున్న వారిలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ సహా టీమిండియా సిబ్బంది ఉన్నారు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా అభిమానులు భావిస్తున్నారు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ విశాఖపట్నంలో, రెండో మ్యాచ్ తిరువనంతపురంలో, మూడో మ్యాచ్ గౌహతిలో, నాలుగో మ్యాచ్ రాయ్‌పూర్‌లో, ఐదో మ్యాచ్ బెంగళూరులో జరగనుంది. అన్ని మ్యాచ్‌లు IST సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ వంటి సీనియర్ క్రికెటర్లు టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నారు. చివరి రెండు టీ20లకు శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో ఉంటాడు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే విశాఖలో జరిగే తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ముందు వర్షం కురిసినా.. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – 2023-11-23T16:39:30+05:30 IST