దట్టమైన పొగమంచు: రాగల రెండు రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు

ABN
, ప్రచురణ తేదీ – డిసెంబర్ 30, 2023 | 07:25 AM

చలితో దేశం అల్లాడిపోతోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రంతా విపరీతమైన చలి, ఉదయం నిద్రలేచే సరికి పొగమంచు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

దట్టమైన పొగమంచు: రాగల రెండు రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు

ఢిల్లీ: చలితో దేశం అల్లాడిపోతోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రంతా విపరీతమైన చలి, ఉదయం నిద్రలేచే సరికి పొగమంచు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. మరో రెండు రోజుల పాటు ఉత్తర భారతంలో కూడా తీవ్రమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, ఆగ్నేయ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్ మరియు వాయువ్య రాజస్థాన్‌తో సహా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) శుక్రవారం తెలిపింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు.

పొగమంచు వాయు రవాణా, రోడ్డు రవాణా, రైలు రవాణాపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.5 నుంచి 6.4 డిగ్రీల సెల్సియస్‌ తగ్గుతాయని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత 19.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ సీజన్‌లో సగటు ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండడం గమనార్హం. అలాగే ఢిల్లీలో గత 24 గంటల్లో గాలి నాణ్యత సూచీ 382గా నమోదైంది. శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్, వాయువ్య రాజస్థాన్, పంజాబ్, ఆగ్నేయ ఉత్తరాఖండ్, అస్సాం, హర్యానా మరియు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఒక మోస్తరు పొగమంచు కనిపించింది.

నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 30, 2023 | 07:25 AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *