చివరిగా నవీకరించబడింది:
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బాలికల వసతి గృహంలో 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన భోపాల్‌లోని పర్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బాలికల వసతి గృహంలో 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన భోపాల్‌లోని పర్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
రిజిస్టర్లో 68 మంది బాలికలు..(భోపాల్)
భోపాల్ శివారులోని పర్వాలియా ఆంచల్ బాలికల వసతి గృహాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో ఆకస్మికంగా సందర్శించారు. ఈ సమయంలో రిజిస్టర్‌ను పరిశీలించగా అందులో 68 బాలికల ఎంట్రీలు ఉండగా అందులో 26 మంది అదృశ్యమైనట్లు తేలింది. అదృశ్యమైన బాలికల్లో కొందరు గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారు కాగా, మరికొందరు మధ్యప్రదేశ్‌లోని సెహోర్, రైసెన్, చింద్వారా, బాలాఘాట్లకు చెందినవారు. తప్పిపోయిన బాలికలపై చిల్డ్రన్స్ హోమ్ డైరెక్టర్ అనిల్ మాథ్యూను అధికారులు ప్రశ్నించగా.. సరైన సమాధానం చెప్పలేదు. దీంతో వారు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాలికల హాస్టల్ నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హాస్టల్లో అనేక అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలింది. హాస్టల్‌ను కూడా అక్రమంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
మరోవైపు ఈ ఘటనపై నేషనల్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మిషనరీ నిర్వహిస్తున్న అక్రమ బాలల గృహాన్ని రాష్ట్ర బాలల కమిషన్ చైర్మన్‌తో కలిసి తనిఖీలు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండానే బాలికల హాస్టల్ నడుపుతున్నారన్నారు. తాము ప్రధానంగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నామని, ఈ బాలికల వసతి గృహంలో 6 నుంచి 18 ఏళ్లలోపు 40 మందికి పైగా బాలికలు ఉన్నారని తెలిపారు. వీరిలో అత్యధికులు హిందువులే.