‘వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ వంటి సినిమాల తర్వాత మరోసారి అందరినీ ఆకట్టుకునేందుకు హీరో లక్ష్ రెడీ అవుతున్నాడు. లక్ష చదలవాడ ప్రస్తుతం ‘ధీర’ అనే కమర్షియల్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

ధీర సినిమాలో లక్ష
‘వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ వంటి సినిమాల తర్వాత మరోసారి అందరినీ ఆకట్టుకునేందుకు హీరో లక్ష్ రెడీ అవుతున్నాడు. లక్ష చదలవాడ ప్రస్తుతం ‘ధీర’ అనే కమర్షియల్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అందరిలో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది.
‘ధీర’ గ్లింప్స్ మరియు టీజర్లతో ఈ సినిమా ఏ జానర్లో ఉంటుంది? ఎలా ఉండబోతోంది? మేకర్స్ సూచన ఇచ్చారు. ఇప్పుడు ‘ది రైడ్ ఆఫ్ ధీర’ అనే మేకింగ్ వీడియోలో షూటింగ్ స్పాట్లో యూనిట్ ఎంత సరదాగా గడిపిందో.. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో.. ఈ మేకింగ్ వీడియోను ఆసక్తికరంగా కట్ చేశారు. ఇక ‘ధీర’ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది.
ఇది కూడా చదవండి:
====================
*రష్మిక మందన్న: రష్మిక డీప్ ఫేక్ వీడియో.. ఏపీ వ్యక్తి అరెస్ట్
*******************************
*మోహన్ బాబు: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది కానీ..?
*******************************
*వరుణ్ తేజ్: మెగా ప్రిన్స్ బర్త్ డే స్పెషల్ ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్.. ఎలా ఉంది?
****************************
*హన్సిక: సింగిల్ టేక్‌లో 34 నిమిషాల షాట్..
****************************
నవీకరించబడిన తేదీ – జనవరి 20, 2024 | 09:54 PM