ఢిల్లీ: రామనామ స్మరణతో భారతావని పులకిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ (పీఎం మోదీ) సమక్షంలో అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా దేశంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయోధ్యతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో చారిత్రక నేపథ్యం ఉన్న రామమందిరాలు ఉన్నాయి. వాటి వివరాలు..
1. అయోధ్య రామమందిరం, UP
ఈ ఆలయ చరిత్ర శ్రీరాముడి జన్మస్థలంతో ముడిపడి ఉంది. భారతదేశ సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉంది. జనవరి 22న అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది
2. రామ్ రాజా ఆలయం, మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో ఉన్న ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం శ్రీరాముడికి దగ్గరి సంబంధం కలిగి ఉందని చరిత్ర చెబుతోంది.
3. సీతా రామచంద్ర స్వామి ఆలయం, తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో ఉన్న శ్రీరాములవారి ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉంది. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయ చరిత్ర రామాయణంతో ముడిపడి ఉంది. రాముడు, సీత వనవాస సమయంలో ఇక్కడే ఉండేవారని భక్తుల నమ్మకం.
4. రామస్వామి ఆలయం, తమిళనాడు
తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణంలోని రామ స్వామి ఆలయం శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ద్రావిడ శైలిని ప్రతిబింబిస్తుంది.
5. కాలరామ్ ఆలయం, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని నాసిక్‌లోని కాలరామ్ ఆలయంలో రాముడు నల్లరాతిలో దర్శనమిస్తాడు. దీనికి పీష్వా కాలం నాటి చారిత్రక ప్రాధాన్యత ఉంది.
6. త్రిప్రయార్ శ్రీ రామ దేవాలయం, కేరళ
కేరళలోని త్రిసూర్‌లో ఉన్న ఈ ఆలయం హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
7.రామ మందిరం, ఒడిశా
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న ఈ ఆలయం కళింగ శైలిలో నిర్మించబడింది.
8. కోదండరామ దేవాలయం, కర్ణాటక
కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో ఉన్న ఈ ఆలయ గోడలపై రామాయణంలోని ముఖ్యమైన దృశ్యాలు చిత్రలేఖనాల రూపంలో ఉన్నాయి.
9. శ్రీ రామ్ తీర్థ ఆలయం, అమృత్సర్
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న ఈ ఆలయం మహర్షి వాల్మీకికి సంబంధించినది. వాల్మీకి రామాయణ భాగాలను ఇక్కడే రచించాడని చరిత్ర చెబుతోంది.
10. రఘునాథ్ ఆలయం, జమ్మూ
జమ్మూ, జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉంది.
11. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలోని అమ్మపల్లిలో వెలసిన ఈ దేవాలయం చాలా విశిష్టమైనది. రాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది.