ఢిల్లీ చలో : రైతుల ఆందోళనకు కారణమేంటి? వారి డిమాండ్లు ఏమిటి?

ఢిల్లీ చలో : రైతుల ఆందోళనకు కారణమేంటి?  వారి డిమాండ్లు ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకపోవడంతో పాటు వారి డిమాండ్లను నెరవేర్చలేదు. చలో ఢిల్లీ పేరుతో హస్తినలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పంజాబ్, హర్యానా రాష్ర్టాల నుంచి ట్రాక్టర్లతో బయల్దేరిన రైతులు చాలాసేపు నిరసన తెలపాలని నిర్ణయించుకుని సరిపడా ఆహారం, ఇతర సామాగ్రిని తమ వెంట తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 2020-21లో ఉద్యమించినప్పుడు కేంద్రం తమ డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చిందని, కానీ వాటిని నెరవేర్చలేదని రైతులు వాపోతున్నారు.

దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఢిల్లీలో కూడా 144 సెక్షన్ విధించారు. అంతేకాదు ర్యాలీగా వచ్చిన రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై కఠినంగా వ్యవహరించారు. ఎక్కడికక్కడ రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా అన్నదాతలు కూడా వెనక్కి తగ్గడం లేదు. వెనక్కి వెళ్లాలని పోలీసులు చెప్పడంతో వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. ఇప్పుడు ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో.. రైతులు ఈ ఆందోళన చేపట్టడానికి గల కారణాలేంటి? వారి డిమాండ్లు ఏమిటి? సమస్యలపై చర్చిస్తున్నారు.

రైతుల డిమాండ్లు

* పంటలకు కనీస మద్దతు ధర హామీ ఇచ్చే చట్టం. ఇది రైతులకు జీవనాధారం.

* విద్యుత్ సవరణ చట్టం 2020ని రద్దు చేయాలి.

* ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో చనిపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి.

* 2020లో కాపు ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలి.

* స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలి.

* రైతులకు రుణమాఫీ చేయాలి.

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), రైతు రుణమాఫీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల అమలుకు చట్టబద్ధమైన హామీలపై చర్చించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయినా రైతు ప్రతినిధుల నుంచి సరైన స్పందన లేదు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. రైతులతో ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగాయని, పరిష్కారానికి మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని, మార్గనిర్దేశం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే రైతులను అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని.. రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు.

నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 13, 2024 | 04:13 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *