IPL 2023: IPLతో రికార్డులు బద్దలు కొట్టిన జియో సినిమా

IPL 2023: IPLతో రికార్డులు బద్దలు కొట్టిన జియో సినిమా

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-10-21T19:57:56+05:30 IST

జియో సినిమా ద్వారా తొలిసారిగా ప్రసారం చేసిన ఐపీఎల్‌ను 45 కోట్ల మంది చూశారని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఇది ప్రపంచ రికార్డు అని వివరించారు.

IPL 2023: IPLతో రికార్డులు బద్దలు కొట్టిన జియో సినిమా

ఈ ఏడాది ఐపీఎల్ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో సినిమా సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జియో సినిమా క్రికెట్ అభిమానుల కోసం ఐపిఎల్‌ను ఉచితంగా ప్రసారం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. జియో సినిమా ద్వారా తొలిసారిగా ప్రసారమైన ఐపీఎల్‌ను 45 కోట్ల మంది చూశారని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఇది ప్రపంచ రికార్డు అని వివరించారు. ఈ పరిణామం కారణంగా మీడియా, వినోద రంగంపై జియో సినిమా అద్భుతమైన ప్రభావం చూపిందని అంబానీ అన్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌ని టీవీల్లో ఎక్కువ మంది చూడలేదని, మొబైల్ వంటి డిజిటల్ పరికరాల్లో చూశారని పేర్కొన్నారు. అంతేకాకుండా, జియో సినిమా తీసుకున్న నిర్ణయం భారతదేశంలో క్రికెట్ వంటి కంటెంట్‌ను చూసే విధానంలో భారీ మార్పును తీసుకొచ్చిందని ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: వన్డే ప్రపంచకప్: వైడ్ బాల్ వివాదం.. నిబంధనలను కోహ్లీ తప్పుబట్టాడు

జియో సినిమా తీసుకొచ్చిన ఏఆర్/వీఆర్ డివైజ్ వల్ల ఇంట్లోనే 360 డిగ్రీలలో మ్యాచ్ వీక్షించిన అనుభవం వచ్చిందని ముఖేష్ అంబానీ వివరించారు. ఐపీఎల్ సక్సెస్‌తో జియో సినిమా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లు కూడా భారీగా పెరిగాయని అన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ మెగా టోర్నీని ఐదోసారి గెలిచి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌ను 120 కోట్ల మంది వీక్షించినట్లు నివేదికలు వెల్లడించాయి. సగటున 60 నిమిషాల పాటు మ్యాచ్ వీక్షించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

నవీకరించబడిన తేదీ – 2023-10-21T19:57:56+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *